World Longest Train Journey: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రైల్వే వ్యవస్థ విస్తృతమైంది. అభివృద్ది చెందుతోంది. కాలంతో పోటీ పడుతూ ప్రయాణించే బుల్లెట్ రైళ్లు వచ్చేశాయి. అందుకే రైల్వే రవాణా అంతగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచంలో అతిపెద్ద రైలు మార్గమేది, ఎన్ని రోజుల ప్రయాణమో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ వివరాలు మీ కోసం..
ఊళ్లను, పచ్చని బయళ్లు, నదీ నదాలను, రాష్ట్రాల్ని దాటుకుంటూ సాగేది రైలు ప్రయాణం. అన్ని ప్రాంతాల అందాల్ని, విశేషాల్ని ఆస్వాదిస్తూ, ఏ మాత్రం అలసట లేకుండా సాగుతుంది కాబట్టే రైల్వే ప్రయాణమంటే అందరికీ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో కూడా సుదీర్ఘమైన రైలు ప్రయాణ మార్గాలున్నాయి. ఈ ప్రయాణం కొన్ని రోజుల వరకూ ఉంటుంది. అదే సమయంలో ప్రపంచంలో అతిపెద్ద రైలు ప్రయాణం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..ఈ ప్రయాణం ఎన్ని రోజులుంటుంది, ఎన్ని పట్టణాల్ని చుట్టుకుంటూ వెళ్తుందనే వివరాలు తెలుసుకుందాం..
ఇండియాలో రైల్వే ప్రయాణం అత్యంత సురక్షితం, ఆహ్లాదకరమైందిగా భావిస్తారు. కానీ ఇప్పుడు మనం చర్చించేది ప్రపంచంలోనే అతి పెద్దదైన రైలు మార్గం గురించి. ఈ రైలు మార్గం పేరు ట్రాన్స్ సైబీరియన్. ఇది మాస్కో నుంచి ప్యోంగ్‌యాంగ్ వరకూ ప్రయాణిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద రైలు మార్గం ఇదే. రష్యాలోని మాస్కో నుంచి ఉత్తర కొరియా ప్యోంగ్ యాంగ్ వరకూ 10,214 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ట్రాన్స్ సైబీరియన్ రైల్వే 1916లో ప్రారంభమైంది. ట్రాన్స్ సైబీరియన్ రైల్వే ప్రయాణీకుల్ని మాస్కో నుంచి వ్లాదివోస్తోక్ జర్నీ కూడా అందిస్తుంది. ఈ మార్గం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే మార్గం. ఈ మార్గంలో వెళ్లే రైలు కొండలు, అడవులు దాటుకుంటూ వెళ్తుంది.
Also Read: 7th pay commission, DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. ఏకంగా 8% డీఏ హైక్?
ఈ రైలు ఉత్తర కొరియాను రష్యాను కలుపుతుంది. నార్త్ కొరియా నుంచి రష్యాలోని మాస్కో వరకూ ఒక ట్రైన్ రష్యా వ్లాదివోస్తోక్ వరకూ తీసుకెళ్తుంది. ఆ తరువాత వ్లాదివోస్తోక్ నుంచి మాస్కోకు వెళ్లే ట్రైన్ వెనుక జత కలుస్తుంది. ఏ ఒక్క ప్రయాణీకుడు కూడా తమ సీటు మారాల్సిన అవసరముండదు. ఈ మొత్తం జర్నీ పూర్తయ్యేందుకు 7 రోజుల 20 గంటల 25 నిమిషాలు పడుతుంది. ఈ సమయంలో ఈ రైలు 16 ప్రముఖ నదుల్ని 86 పట్టణాల్ని దాటుకుంటూ ప్రయాణిస్తుంది.
Also Read: Japan Army Helicopter Crashed: 10 మందితో సముద్రంలో కూలిన ఆర్మీ హెలీక్యాప్టర్ ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook