Ap Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 49,568 మందికి పరీక్షలు నిర్వహించారు. 1,125 మందికి కరోనా పాజిటివ్(Corona Positive) వచ్చింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,31,974కి చేరింది. వైరస్ తో 9 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్(Covid-19) బారిన పడి చనిపోయినవారు మొత్తం సంఖ్య 14,019కి చేరింది.
ఒక్కరోజు వ్యవధిలో 1,356 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు 20,03,543 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,412 యాక్టివ్(Active Cases) కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,74,13,209 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Also Read: AP Corona Update: రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్ కేసులు
థర్డ్ వేవ్(Corona Third Wave) వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM jagan) ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ సేవలను విస్తృత పరుస్తూ.. ప్రతి ఆసుపత్రిలో 50 శాతం బెడ్స్ కేటాయించాలని ఆదేశించారు. అంతేకాకుండా అత్యాధునిక వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook