తెలంగాణ సీఎంకు సవాల్ విసిరిన నటుడు శివాజీ

ఎన్నికల సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు, జీఎస్టీ దాడులపై నటుడు శివాజీ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని హీరో శివాజీ కలిశారు. ఈ సందర్భంగా దాడుల పేరుతో అధికారులు  సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు

Last Updated : Mar 22, 2019, 03:14 PM IST
తెలంగాణ సీఎంకు సవాల్ విసిరిన నటుడు శివాజీ

అమరావతి: ఎన్నికల సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు, జీఎస్టీ దాడులపై నటుడు శివాజీ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని హీరో శివాజీ కలిశారు. ఈ సందర్భంగా దాడుల పేరుతో అధికారులు  సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు

బ్యాంకుల నుంచి మనీ తీసుకెళ్తుండగా.. తగిన ఆధారాలు చూపించినా నగదు సీజ్ చేయడంపై ద్వివేది దృష్టికి తీసుకెళ్లారు. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఈవోకి శివాజీ విజ్ఞప్తి చేశారు. ఐటీ దాడులకు పాల్పడుతున్నారని మెడీ సర్కార్ పై టీడీపీ సర్కార్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ ఈసీకి ఫిర్యాదు చేయడం గమనార్హం

ఈ సందర్భంగా కేసీఆర్ అంశాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు చేయడం కాదని.. ఆయనకు దమ్ముంటే ఏపీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఎవరికైనా బహిరంగంగా మద్దతు ప్రకటించొచ్చని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయాల  స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని బలిచేయొద్దన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపులో కేసీఆర్ పాత్ర లేదా అని నటుడు శివాజీ ప్రశ్నించారు 

Trending News