Chandrababu Naidu: ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. వారికి పెట్రోల్, డీజీల్‌పై 50 శాతం రాయితీ..!.. డిటెయిల్స్ ఇవే..

Petrol and diesel prices: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో కొన్నిరోజులుగా పెట్రోల్, డీజీల్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.   

Written by - Inamdar Paresh | Last Updated : Dec 28, 2024, 02:13 PM IST
  • దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రన్న సర్కారు..
  • పెట్రోల్, డీజీల్ ధరలపై రాయితీ..
Chandrababu Naidu: ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. వారికి పెట్రోల్, డీజీల్‌పై 50 శాతం రాయితీ..!.. డిటెయిల్స్ ఇవే..

chandrababu govt to give 50 percent subsidy on petrol and diesel for disabled persons: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలో ఉంది. ఒకవైపు ఏపీకి మరల గాడిలో పెట్టే విధంగా పాలన అందిస్తునే.. ప్రజలకు డెవలప్ మెంట్ పథకాల్ని కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొన్నిరోజులుగా పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

సామాన్యుడు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజీల్ ధరల్ని చూసి బెంబెలెత్తిపోతున్నాడు. అసలు..తన వెహికిల్ ను బైటకు తీయాలంటేనే పలు మార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీలోని దివ్యాంగుకులకు.. పెట్రోల్, డీజీల్ ధరల్లో 50శాతం రాయితీ  కల్పించేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.

ఈ క్రమంలో దివ్యాంగులు ఈ పథకానికి అప్లై చేసుకొవాలని ఏపీ సర్కారు ఆదేశించినట్లు సమాచారం. 2024-25 ఏడాదికి సంబంధించి ఈ పథకం అమలు కోసం.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు రూ.లక్ష చొప్పున రూ. 26 లక్షల్ని ప్రభుత్వం కేటాయించినట్లు సమాచారం. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి పలు జిల్లాల్లో అర్హత ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించడం కోసం సర్కారు ఒక ప్రకటన విడుదల చేసింది.

Read more: Pawan kalyan: పవన్ కళ్యాణ్‌పై కుట్ర జరిగిందా..?.. నకిలీ ఐపీఎస్ ఘటనపై హోంమంత్రి సీరియస్..

రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం మూడు టైర్ల మోటరైజ్డ్ వాహనాలు ఉపయోగించే దివ్యాంగులకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద పెట్రోలు/డీజిల్‌కు అయ్యే ఖర్చులో 50శాతం రాయితీగా రీయింబర్స్ చేస్తుంది. ఈ డబ్బుల్ని ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లలో మరల జమ చేయనున్నట్లు తెలుస్తొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News