Ship Repairing Unit: ఏపీలో త్వరలో షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు

Ship Repairing Unit: దేశంలో సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తీరప్రాంతం వేదికగా ఆదాయం, ఉపాధి మార్గాలు పెంచుకునేందుకు ఏపీ మారిటైమ్ బోర్డ్ ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్తగా షిప్ రిపేరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు యోచిస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 17, 2021, 10:20 AM IST
  • షిప్ రిపేరింగ్, షిప్ రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్‌ బోర్డు కసరత్తు
  • శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు అనుకూలం
  • షిప్‌ రిపేరింగ్‌–రీ సైక్లింగ్‌ క్లస్టర్‌తో 15 వేల మందికి ఉపాధి
Ship Repairing Unit: ఏపీలో త్వరలో షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు

Ship Repairing Unit: దేశంలో సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తీరప్రాంతం వేదికగా ఆదాయం, ఉపాధి మార్గాలు పెంచుకునేందుకు ఏపీ మారిటైమ్ బోర్డ్ ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్తగా షిప్ రిపేరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు యోచిస్తోంది.

దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఏకైక వరం సుదీర్ఘమైన తీరప్రాంతం(Sea Coast). ఓ వైపు సముద్రం, మరోవైపు నదులు, ఇంకోవైపు అటవీ ప్రాంతం. సుదీర్ఘమైన తీరప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని ఆదాయ, ఉపాధి మార్గాలకు ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక రచిస్తోంది. తూర్పు తీరప్రాంతంలో షిప్ రిపేరింగ్ యూనిట్ ఒక్కటి కూడా లేకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడంపై దృష్టి సారించింది. మారిటైమ్ ఇండియా విజన్ 2030 లో భాగంగా షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ మారిటైమ్ బోర్డు కేంద్ర ప్రభుత్వానికి(Central government) ప్రతిపాదనలు పంపింది. ఈ క్లస్టర్‌కు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు అనుకూలంగా ఉన్నాయని, దీర్ఘకాలిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశాన్ని సద్వినియోదం చేయాల్సిందిగా కేంద్ర ఓడరేవుల మంత్రి శర్వానంద్ సోనోవాల్‌ను కోరింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ముంచు ఏపీ మారిటైమ్(AP Maritime Board) అధికారులు ప్రతిపాదన ఉంచారు. 

షిప్ రిపేరింగ్(Ship Repairing), రీ సైక్లింగ్(Ship Recycling)యూనిట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 15 వేలమందికి ఉపాధి లభించనుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా. ఒక షిప్‌ను రీ సైక్లింగ్ చేసేందుకు సగటున 3 వందలమంది స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరముంటుంది. ఈ యూనిట్‌పై ఆధారపడి 50 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కానున్నాయనేది మరో అంచనా. అంతేకాకుండా పది లక్షల టన్నుల ఉక్కును తుక్కుగా మార్చి అమ్మితే జీఎస్టీ రూపంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి 270 కోట్ల ఆదయం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి వేయికి పైగా ఓడలు రీ సైక్లింగ్(Recycling of Ships) అవుతున్నాయి. ఇప్పటి వరకూ గుజరాత్ రీ సైక్లింగ్ వ్యాపారంలో ముందంజలో ఉంది. ఈ అవకాశాన్ని తూర్పు తీర ప్రాంతంలో ఏపీ అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

Also read: APEAPCET 2021: ఇంజనీరింగ్, ఫార్మసీ తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి,, తొలిసారిగా ప్రైవేటు వర్శిటీల్లో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News