TOEFL Training: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ టోఫెల్ (TOEFL) శిక్షణను అందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కల్పించి.. ప్రస్తుత పోటీని తట్టుకుని జాతీయ, అంతర్జాతీయంగా ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ టోఫెల్ శిక్షణ అందించడం ద్వారా.. రాష్ట్రంలోని మొత్తం పాఠశాల విద్యార్థుల జనాభాలో సుమారు 56 శాతం మందికి ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుంది.
చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు సరైన ఇంగ్లీష్‌ను నేర్చుకునే సదుపాయలు ఉండకపోవచ్చు. ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం కల్పించి.. గ్రామీణ, పట్టణ విద్యా అవకాశాల మధ్య అంతరాన్ని తగ్గించడంతోపాటు ప్రపంచ శ్రామికశక్తిలో చేరికను ప్రోత్సహించేలా ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ భాషకు ప్రాముఖ్యత ఏర్పడిన విషయం తెలిసిందే.
పేద విద్యార్థుల జీవితాలను మార్చడానికి చొరవ తీసుకోవడం అభినందనీయం. టోఫెల్ పరీక్షలో ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికన్, యూరోపియన్ ఉచ్ఛారణలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందిస్తారు. విదేశీ యాసను విద్యార్థులు అర్థం చేసుకోవడంతోపాటు.. చక్కగా మాట్లాడేలా శిక్షణ ఇస్తున్నారు. వెనుకబడిన, అట్టడుగు వర్గాల కుటుంబాలలో వెలుగు నింపే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
Also Read: Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన, తక్షణం ఆపాలంటూ ఆగ్రహం
Also Read: Earthquake: బంగాళాఖాతంలో భూకంపం, భారీగా పోటెత్తిన అలలు, సునామీ హెచ్చరిక జారీ చేశారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook