Kurnool News: ఉగాది వేడుకల్లో ఊహించని విషాదం.. 15 మంది పిల్లలు సీరియస్..

Ugadi festival: ఉగాది పండుగ సందర్భంగా చిన్నకూటేరు ప్రాంతంలో ప్రభలు ఊరేగిస్తున్నారు. ఇందులో గ్రామస్థులు, చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ క్రమంలో చిన్న పిల్లలు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేస్తూ కిందపడిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 11, 2024, 02:05 PM IST
  • ఉగాది వేడుకల్లో ఊహించని ఘటన..
  • ఆస్పత్రిపాలైన 15 మంది చిన్నారులు..
Kurnool News: ఉగాది వేడుకల్లో ఊహించని విషాదం.. 15 మంది పిల్లలు సీరియస్..

Short Circuit Tragedy In Ugai Celebrations In Kurnool: మనదేశంలో ప్రతిఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. యుగాది.. అంటే సంవత్సరానికి తొలిరోజని అర్దం. ఈ వేడుకలను షడ్రుచుల సమ్మేళనంతో చేసిన పచ్చడిని తాగి ఉల్లాసంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రోధి నామ సంవత్సరం తమకు, తమ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసి రావాలని కూడా వేడుకలు జరుపుకున్నారు. ఇదిలా ఉండగా.. ఉగాది నేపథ్యంలో కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఉత్సవాలు, జాతరలు నిర్వహిస్తారు. అదేవిధంగా కొన్ని చోట్ల దేవుడి రథయాత్రలను వేడుకగా జరుపుకుంటారు. ఇలాంటి వేడుకలకు ప్రజలంతా భారీగా.. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ క్రమంలో ఏపీలోని కర్నూల్ లో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

పూర్తి వివరాలు..

కర్నూలు జిల్లాలోని చిన్నకూటేరు లో ఉగాది వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సావాలు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న ఆలయానికి భక్తుల, ప్రజలు పెద్ద ఎత్తున పొటెత్తారు. స్థానికంగా ప్రభలు ఊరేగించే కార్యక్రమం ప్రారంభమైంది. దీనిలో వేలాదిగా ప్రజలు హజరయ్యారు. పిల్లలు కూడా ఉత్సాహంగా ప్రభలను తాగులతో లాగే కార్యక్రమంలో పొటీపడ్డారు.

ఈ క్రమంలో ఒక్కసారిగా ఊహకందని విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిన్నకూటేరులో ప్రభలు లాగుతుండగా.. ఒక్కసారిగా 15 మందికి పైగా పిల్లలు కరెంట్ షాక్ తో తగలడంతో కిందపడిపోయారు. వెంటనే అక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, భక్తులుపెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలు కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లడం చూసి కన్నీరుమున్నీరయ్యారు.

Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..

వెంటనే స్థానికులు పిల్లలకు సపర్యలుచేసి, దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రభలకు కరెంట్ సర్వీస్ వయర్లు తాకడం వల్లనే ఇలాంటి ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన 15 మంది చిన్నారులను హుటాహుటిన కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చిన్నారులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. 

Read More: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News