AP NEW DGP: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారుల బదిలీలు మొదలయ్యాయి. కొత్త ఛీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకంతో బదిలీలు ప్రారంభమయ్యాయి. ఏపీ కొత్త డీజీపీగా 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం వేటు వేయగా ఆయన స్థానంలో ద్వారకా తిరుమలరావు నియమితులు కావల్సింది. కానీ ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన కంటే సీనియర్లుగా ఉన్న అంజనా సిన్హా, ఎం ప్రతాప్‌లను కూడా ఎన్నికల సంఘం పక్కనబెట్టింది.
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ద్వారకా తిరుమలరావుకు అదృష్టం కలిసొచ్చింది. ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు ఏపీ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2021 జూన్ నుంచి ఈయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. అంతకుముందు రైల్వే శాఖలో డీజీపీగా చేశారు. విజయవాడ కమీషనర్‌గా చేసిన అనుభవం ఉంది.
ఏపీ కొత్త డీజీపీ కెరీర్ ఇలా..
1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న ద్వారకా తిరుమలరావు తొలి పోస్టింగ్ కర్నూలు ఏఎస్పీగా జరిగింది. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అడిషనల్ ఎస్పిగా చేశారు. తరువాత అనంతపురం, కడప, మెదక్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. తిరిగి అనంతపురం, హైదరాబాద్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా చేశారు. సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ పోలీస్ కమీషనర్‌గా పనిచేశారు.
Also read: Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook