AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, తగ్గిన మరణాలు

AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో వేగవంతమవుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 24, 2021, 05:26 PM IST
 AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, తగ్గిన మరణాలు

AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో వేగవంతమవుతోంది.

ఏపీలో కరోనా సంక్రమణ(Coronavirus spread) స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని కరోనా కేసుల్లో పెద్దఎత్తున తగ్గుదల కన్పించింది. కేసుల సంఖ్య తగ్గుతున్నా..కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 88 వేల 622 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..4 వేల 981 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణైంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 38 మంది మరణించారు. మరణాలరేటు కూడా రోజురోజుకూ తగ్గుతోంది. ఏపీలో ఇప్పటి వరకూ 12 వేల 90 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గత 24 గంటల్లో 6 వేల 464 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 లక్షల 4 వేల 844 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 49 వేల 683 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఏపీలో ఇప్పటి వరకూ 2 కోట్ల 14 లక్షల 49 వేల 636 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు. 

Also read: AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు త్వరలో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, అఫిడవిట్ సమర్పించిన ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News