Andhra Pradesh Theatres: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల వివాదం ఎట్టకేలకు ముగిసినట్లే కనిపిస్తుంది. శుక్రవారం నుంచి సినిమా హాళ్లను 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో కొనసాగించవచ్చని మీడియాకు తెలిపింది. కరోనా నిబంధనలను పాటిస్తూ థియేటర్లకు ప్రేక్షకులను అనుమతిని ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. మూవీ టికెట్ రేట్స్ పై ఏపీ సెక్రటేరియట్ లో గురువారం సమావేశమైన స్టీరింగ్ కమిటీ.. తమ నివేదికను ప్రభుత్వం ముందు ఉంచింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్ నేతృత్వంలో ఈ కమిటీ సమావేశమైంది. సమావేశం ముగిసిన తర్వాత సినిమా టికెట్ ఇష్యూ కమిటీ సభ్యులు మాట్లాడారు.
"శుక్రవారం (ఫిబ్రవరి 18) నుంచి ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లలో 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో టికెట్లు విక్రయించుకోవచ్చు. అయితే థియేటర్ వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ.. కరోనా మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది" అని అధికారులు మీడియాకు తెలిపారు.
అయితే మూవీ టికెట్ రేట్స్ పై కమిటీ సమీక్ష నిర్వహించిందని అధికారులు తెలిపారు. సినిమా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని టికెట్ రేట్స్ విషయంలో మార్పులు జరిపినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసామని.. కమిటీ నిర్ణయించిన వాటిలో 99 శాతం రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే గవర్నమెంట్ అధికారిక ప్రకటన చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Also Read: AP Cinema Ticket Issue: నేటితో సినిమా కష్టాలకు బ్రేక్.. టికెట్ రేట్లు ప్రకటించే అవకాశం!
Also Read: Ali, YS Jagan Meet: సినీ ప్రముఖులను సీఎం జగన్ అవమానించారా.. స్పందించిన అలీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి