AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దికాలంగా తగ్గుతూ వచ్చిన కేసుల్లో ఇప్పుడు స్వల్పంగా పెరుగుదల కూడా కన్పిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో కరోనా వైరస్(Coronavirus)పాజిటివ్ కేసులు స్థిరంగానే కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 64 వేల 550 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..1557 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. మరోవైపు 18 మంది కరోనా కారణంగా మరణించారు.ఇప్పటి వరకూ రాష్ట్రంలో 13 వేల 825 మంది కరోనా కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20 లక్షల 12 వేలమందికి కరోనా సోకగా..19 లక్షల 83 వేల 119 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 1213 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల 179 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 65 లక్షల 35 వేలమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు.
గత 24 గంటల్లో చిత్తూరులో 255, తూర్పు గోదావరి జిల్లాలో 232, పశ్చిమ గోదావరి జిల్లాలో 212, నెల్లూరులో 164, కృష్ణా జిల్లాలో 159, గుంటూరులో 127 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. తూర్పు గోదావరి జిల్లాలో గత 3-4 రోజుల్నించి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Also read: Delta Variant: డెల్టా వేరియంట్‌తో తస్మాత్ జాగ్రత్త, పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook