Ministers on Narayana arrest : పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టయ్యారు. ఈ అరెస్టు ఆధారాలతో కూడిందని ఏపీ మంత్రులు బొత్స, అంబటితోపాటు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకు పోతుందని పేర్కొన్నారు నేతలు.
లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల స్టాఫ్ హస్తముందన్నారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. కేసులో 60 మందిని అరెస్టు చేశామన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దోషులెంతటి వారైనా శిక్ష తప్పదన్నారు బొత్స.
నారాయణ అరెస్టుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థల స్టాఫ్ హస్తముందన్నారు. తిరుపతి నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ అరెస్ట్ తర్వాత.. ఆయన వాంగ్మూలాన్ని బట్టి.. అప్పటి మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. విచారణలో ఆధారాలు లభించినందునే... నారాయణ దంపతులను అరెస్ట్ చేశారని అంబటి అన్నారు. ఇది తెలుగుదేశం నేతలపై కక్ష సాధింపు కానేకాదన్నారు అంబటి.
విద్య, వైద్య రంగాల్లో చెడును మొగ్గలోనే తుంచేయకుంటే ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుందన్నారు సజ్జల.
ముఖ్యమంత్రి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, పోలీసులు స్వేచ్ఛగా పనిచేసి వేగంగా నిందితులను పట్టుకున్నారని అన్నారు. తప్పులను సరిదిద్దకుంటే ప్రజలిచ్చిన అధికారం ఫలాలు అందించలేమన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కావొద్దని, అందరూ సమానమే అని అచ్చెన్నాయుడు అరెస్ట్ సందర్భంగా కూడా చూశామన్నారు సజ్జల. కేసును లాజికల్ ఎండ్‌కు తీసుకెళ్లేందుకు సర్కారు పనిచేస్తుందన్నారు.
Also Read : Sarkaru vaari paata : సీఎం జగన్ గురించి సూపర్ స్టార్ మహేష్ ఏమనుకుంటున్నారంటే..
Also Read : Pooja Hegde Saree Pics: సారీలో పూజా హెగ్దే.. ఇలా కూడా మెరిసిపోతున్న బుట్టబొమ్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook