AP Cabinet: పీఆర్సీ సహా కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర

AP Cabinet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 21, 2022, 04:29 PM IST
AP Cabinet: పీఆర్సీ సహా కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర

AP Cabinet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవలి కాలంలో తీసుకున్న పలు నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం (Ap Cabinet) ఆమోదం తెలిపింది. పీఆర్సీ సహా పలు కీలక నిర్ణయాల్ని కేబినెట్ ఆమోదించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకునన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లో ఉద్యోగులకు పది శాతం ప్లాట్లు, 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. రైతుల్నించి ధాన్యం కొనుగోళ్లకు 5 వేల కోట్లు కేటాయించినట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు భూకేటాయింపును కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవి కాకుండా ఈబీసీ నేస్తం పథకం, నూతన పీఆర్సీ(New PRC), కోవిడ్ కారణంగా చనిపోయిన కుటుంబీకులకు కారుణ్య నియామకం, అగ్రవర్ణ పేద మహిళలకు 45 వేల ఆర్ధిక సహాయం, కిడాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకు తిరుపతిలో 5 ఎకరాల కేటాయింపు, వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజ్‌లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 

Also read: SC Railway: కరోనా సంక్రమణ నేపధ్యంలో పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News