SC Railway: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మూడున్నర లక్షల వరకూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave)విరుచుకుపడుతోంది. కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 3 లక్షల 47 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్రమణను దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకూ 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కరోనా సంక్రమణ పెరుగుతున్న నేపధ్యంలో రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. కరోనా సంక్రమణ ఎక్కువగా ఉండటమే కాకుండా..ఈ రైళ్లకు ప్రయాణీకులు కూడా అంతగా లేనందున 55 రైళ్లను రద్దు చేసినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) తెలిపింది.
దేశంలో గత 24 గంటల్లో 3 లక్షల 47 వేల 254 కొత్త కేసులు నమోదు కాగా, 703 మంది మరణించారు. 2 లక్షల 51 వేల మంది కోలుకున్నారు. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 17.94కు చేరుకుంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 85 లక్షల 66 వేలకు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 20 లక్షల 18 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఒమిక్రాన్ (Omicron Variant)కేసుల సంఖ్య 9 వేల 692కు చేరుకుంది.
Also read: Gudivada Casino issue : గుడివాడకు వెళ్లిన టీటీపీ నిజనిర్ధారణ కమిటీ, భారీగా పోలీసుల మోహరింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
SC Railway: కరోనా సంక్రమణ నేపధ్యంలో పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే