ఉద్యోగ అభ్యర్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం జగన్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు

Last Updated : Aug 1, 2019, 01:12 AM IST
ఉద్యోగ అభ్యర్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం జగన్

ప్రభుత్వ కొలువ కోసం దరఖాస్తుల చేసుకున్న వారందరికీ  ఏపీ సీఎం జగన్ ఆల్‌ ద బెస్ట్ చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలు, పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలు భర్తీకి సన్నాహకాలు జరుగుతున్నాయి.

సెప్టెంబర్ 1న పరీక్ష

నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ పోస్టుల భర్తీకి సంబంధించి  రాత పరీక్ష సెప్టెంబరు ఒకటవ తేదీన నిర్వహిస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో అభ్యర్ధులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు స్పందించారు.
 

ఉద్యోగాలకు భారీ స్పందన
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ కు అనూహ్య స్పందన వస్తోంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం సోమవారం ఒక్కరోజే 1.34లక్షల మందికిపైగా దరఖాస్తులు అందాయి. మొత్తంగా ఈ రోజు సాయంత్రం వరకు 4.67 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు

Trending News