రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష.. నవరత్నాలు అమలుపై స్పెషల్ ఫోకస్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Last Updated : Jun 23, 2019, 01:19 PM IST
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష.. నవరత్నాలు అమలుపై స్పెషల్ ఫోకస్

అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి ద్వివేది, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశం సుమారు మూడు గంటలపాటు కొనసాగింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, కేటాయింపులపైనే ఈ సమావేశంలో ఎక్కువగా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అన్ని ప్రభుత్వ పథకాలు సజావుగా కొనసాగాలంటే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులతోపాటు రాష్ట్రంలోనూ ఆదాయ వనరులపై ఫోకస్ చేయాలని సీఎం జగన్ ఉన్నతాధికారులకు సూచించినట్టు సమాచారం. జూలై 10వ తేదీ తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే బాగుటుందని సీఎం ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Trending News