Rythu Bharosa Kendralu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు ఖరీఫ్ సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు కీలకంగా , రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని అధికారుల్ని కోరారు.
రైతన్నల సంక్షేమం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( Ap cm ys jagan) దృష్టి సారించారు. 2020-21 ఖరీఫ్ సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలనేవి రైతులకు విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చేదాక నడిపించాలని కోరారు. రైతులకు అన్నిరకాల అవసరాలు తీర్చేలా రైతు భరోసా కేంద్రాలు ( Rythu Bharosa kendralu) పనిచేయాలని అన్నారు. ఇందులో విత్తనాలు, ఎరువులు, పురుగుల నివారణ మందులను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. రైతులు ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా 48 నుంచి 72 గంటలలో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలపై డిస్ప్లే పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు.
కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు అమ్మే పరిస్థితి రాకూడదని అన్నారు. ఒక వేళ రైతులకు గిట్టుబాటు విషయంలో ఎదైనా ఇబ్బంది తలెత్తితే స్థానిక మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకొవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి సందేహం ఉన్నా 155251 టోల్‌ఫ్రీ నెంబర్‌కి సంప్రదించాలని అన్నారు. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో(Rythu Bharosa kendralu) ఇంటర్నేట్ సదుపాయం ఉండాలని తెలిపారు. ప్రతి గ్రామానికి పంటల ప్రణాళిక తయారు చేయాలన్నారు.
Also read: Andhra pradesh: ఆ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కూరగాయలమ్మేవ్యక్తి ఎన్నిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook