AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు

AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,819 మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు కరోనా ధాటికి కొత్తగా 12 మరణాలు సంభవించాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 07:45 PM IST
    • ఆంధ్రప్రదేశ్ లో మరోసారి స్వల్పంగా నమోదైన కరోనా కేసులు
    • కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదు
    • కరోనా ధాటికి మరో 12 మంది మృతి
AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు

AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత వారం రోజులుగా 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం వైద్యారోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో 46,929 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 13,819 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. 

నిన్నటితో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోయాయి. కరోనా ధాటికి కొత్తగా 12 మంది మరణించారు. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు మృతి చెందగా.. ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మరోవైపు కరోనా నుంచి 5,716 మంది కోలుకున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 101396 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. 

అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు

రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1988 కేసులు నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో 1,589, గుంటూరు జిల్లాలో 1,422, అనంతపురం జిల్లాలో 1,345, నెల్లూరు జిల్లాలో 1,305, కర్నూలు జిల్లాలో 1,255, కడప జిల్లాలో 1,083, తూర్పు గోదావరి 1,001 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకూ 14,561 మంది మృతి చెందారు.  

 

Also Read: YSR EBC Nestham : వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ప్రారంభం, హామీ ఇవ్వకున్నా అమలు చేస్తున్నామన్న సీఎం

Also Read: Red Sandalwood Logs : తిరుపతిలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం, కొందరు పరారు.. మరికొందరు దొరికిపోయారు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News