Election Manifesto: పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు షాక్ ఇచ్చిన ఎన్నికల కమీషన్

Election Manifesto: తెలుగుదేశం పార్టీకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బాటంగా విడుదల చేసిన మేనిఫెస్టోను రద్దు చేసింది. అధికారపార్టీ ఫిర్యాదు మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Last Updated : Feb 5, 2021, 12:08 AM IST
Election Manifesto: పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు షాక్ ఇచ్చిన ఎన్నికల కమీషన్
Election Manifesto: తెలుగుదేశం పార్టీకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బాటంగా విడుదల చేసిన మేనిఫెస్టోను రద్దు చేసింది. అధికారపార్టీ ఫిర్యాదు మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) లో పంచాయితీ ఎన్నికలు ( Panchayat Elections ) జరుగుతున్నాయి. పార్టీతో సంబంధం లేని, గుర్తు లేని ఎన్నికలివి. అయితే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ( Telugu Desam ) ఇవేమీ పట్టించుకోకుండా ఆర్భాటంగా ఎన్నికల మేనిఫెస్టోను ( Election Manifesto ) విడుదల చేసిన విషయం తెలిసిందే. పార్టీతో , గుర్తుతో సంబంధం లేని ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడంపై అధికారపార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ( Ysr Congress party ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గుర్తే లేకుండా జరిగే ఎన్నికలకు ఓ పార్టీ మేనిఫెస్టోను ఎలా ప్రచురిస్తుందంటూ ప్రశ్నించింది. దీనిపై ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీ నుంచి వివరణ కోరింది. 

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని..దాంతో ఎన్నికల మేనిఫెస్టోను రద్దు ( Sec cancelled tdp elections manifesto ) చేస్తున్నట్టు ఎన్నికల కమీషన్ ( Election Commission ) ప్రకటించింది. తక్షణం మేనిఫెస్టోను వెనక్కు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే జిల్లాలకు పంపిన మేనిఫెస్టో కాపీల్ని వెనక్కు రప్పించాలని ఆదేశించింది. ఎన్నికల మేనిఫెస్టోతో ప్రచారం నిర్వహించవద్దని స్పష్టం చేసింది. 

Also read: South central railway new trains: తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News