AP Elections Results: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికలు ఏక పక్షంగా సాగాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఫ్యాన్ రెక్కలు కాకవికలం అయ్యాయి. ఏపీలో కూటమి దెబ్బకు వైసీపీకి కుదేలైంది. గత ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు తెలుగు దేశం పార్టీ ఎలా కుంగిపోయిందే.. అదే సీన్ 2024 లో రిపీట్ అయినట్టు కనిపించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వని చెప్పిన పవన్ కళ్యాణ్.. అనుకున్నట్టుగానే..తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ తో కలిసి కూటమిగా పోటీగా చేసారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా తెలుగు దేశం పార్టీ 135 సీట్లలో గెలుపు దిశగా దూసుకుపోతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. అంతేకాదు పోటీ చేసిన 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది.
మరోవైపు బీజేపీ ఈ ఎన్నికల్లో 8 అసెంబ్లీలో పోటీ చేసి గెలిచింది. మరోవైపు రాజమండ్రి, నర్సాపురం, అనకాపల్లి మూడు పార్లమెంట్ సీట్లలో విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ .. ఏపీ క్యాబినేట్ లో చేరుతారా ? లేదా అనేది చూడాలి. ఈ రోజు రాత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటి కానున్నారు. అంతేకాదు కొత్తగా ఏర్పడే క్యాబినేట్ లో ఎవరెవరు మంత్రులుగా ఉండాలనే విషయం డిసైడ్ చేయనున్నారు. మరోవైపు ఏపీ క్యాబినేట్ లో బీజేపీ చేరితే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై క్లారిటీ రానుంది.
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ తెలుగు దేశం పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఒకవేళ పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోతే ఏపీ క్యాబినేట్ లో చేరుతారా లేదా అనేది చూడాలి. మరోవైపు ఏపీలో ప్రతిపక్ష పార్టీ హోదాకు 18 సీట్లు రావాలి. కానీ వైసీపీ 10 సీట్లకే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఎన్నికలు జగన్ సర్కారుకు చెంప పెట్టు అని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook