AB Venkateshwar Rao: ఏపీ మాజీ ఇంటెలీజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకి ఊహించని షాక్

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది. వెంకటేశ్వరావుపై (AB Venkateshwar Rao) ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రాజకీయ పగల దృష్ట్యానే తనను అకారణంగా సస్పెండ్ చేశారని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వర రావుకి ఇది ఊహించని షాక్. 

Last Updated : Mar 7, 2020, 07:40 PM IST
AB Venkateshwar Rao: ఏపీ మాజీ ఇంటెలీజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకి ఊహించని షాక్

అమరావతి: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు (AB Venkateshwar Rao) కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది. వెంకటేశ్వరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఏబీ వెంకటేశ్వర రావు తన హోదాను అడ్డంపెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వెంకటేశ్వర రావు అవినీతికి పాల్పడ్డారంటానికి ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయని కేంద్రం స్పష్టంచేసింది. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హయాంలో ఇంటెలీజెన్స్ చీఫ్‌గా ఉన్న వెంకటేశ్వర రావు పోలీసు శాఖ ఆధునీకరణ పేరుతో ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం వెచ్చించిన రూ.25.5 కోట్ల వ్యవహారంలో భారీ అక్రమాలకు తెరతీసినట్టు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయనపై ఛార్జిషీట్‌ దాఖలు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఆదేశాలు జారీచేస్తూ కేంద్ర హోంశాఖ (Union home ministry) ఓ లేఖ రాసింది. ఏప్రిల్‌ 7 లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

రాజకీయ పగల దృష్ట్యా తనను అకారణంగా సస్పెండ్ చేసిన వైఎస్ జగన్ సర్కార్ (Andhra Pradesh govt).. తనకు వేతనాలు ఇవ్వకుండా తనపై కక్షసాధిస్తోందని ఏబీ వెంకటేశ్వర రావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News