విదేశీ పర్యటనకు మాజీ సీఎం చంద్రబాబు

విదేశీ పర్యటనకు మాజీ సీఎం చంద్రబాబు

Last Updated : Jun 2, 2019, 05:29 PM IST
విదేశీ పర్యటనకు మాజీ సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 7న విదేశాలకు వెళ్లనున్న చంద్రబాబు.. వారం రోజుల పాటు కుటుంబసమేతంగా అక్కడే సరదాగా గడిపి ఈ నెల 14న తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. మండు వేసవి నుంచి కాసింత ఉపశమనం పొందడం కోసమే చంద్రబాబు ఈ విదేశీ పర్యటనకు ప్లాన్ చేసినట్టు పార్టీవర్గాలు భావిస్తున్నాయి. అమరావతికి చేరుకున్న అనంతరం తెలుగు దేశం పార్టీ బలోపేతం దిశగా చంద్రబాబు అన్ని జిల్లాల టీడీపీ నేతలతో వరుసగా భేటీ అవుతారని తెలుస్తోంది. 

ఈ సమావేశాల్లోనే పార్టీ ఓటమిపై సైతం మరోసారి సమీక్ష జరుపుతారని సమాచారం.

Trending News