జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్‌కు 2 ప్లస్ 2 భద్రతను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల గుంటూరు సభ సమయంలో సెక్యూరిటీ కావాలని పవన్ డీజీపీని కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం నలుగురు గన్‌మెన్‌లను రెండు షిఫ్టుల్లో కేటాయించింది. దీంతో పవన్ వెంట ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఎల్లప్పుడూ ఉంటారు.
ఇక పవన్ కళ్యాణ్ త్వరలోనే జనాల్లోకి వెళ్తున్నారు. ఆమేరకు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే..! అయితే పొత్తుల విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేదు. ప్రస్తుతానికైతే ఒంటరిగానే అన్నట్లు ఉన్నా.. భవిష్యత్తులో ఎవరితో కలిసి ముందుకు వెళ్తారన్నది ఇంకా తెలియరాలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు కొందరి అభిప్రాయపడుతున్నారు.
ఇక ప్రత్యేక హోదాపై ఆయన ఎలా ముందుకెళ్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన సగంతి తెలిసిందే..! కానీ ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి తాజా అప్ డేట్ లేదు. ఆయన అన్నీ ఆలోచించి.. సమయం చూసి అడుగు వేసే అవకాశాలు ఉన్నాయి.