/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

ఆంధ్రప్రదేశ్  లో కీలకమైన మార్పులు చేటుచేసుకోబోతున్నాయి. సీఆర్డీఏ రద్దు చేసి ఏఎంఆర్డీఏను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. జోన్ల ఛైర్మన్లకు మంత్రి హోదాతో పాటు ప్రతి జోన్ కు ఓ ప్రత్యేకత ఉండబోతోంది.

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదంతో కీలకమార్పులకు ఏపీ వేదిక కాబోతుంది. త్వరలోనే మూడు రాజధానులు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే సీఆర్డీఏను రద్దు చేసి ఆ స్థానంలో ఏఎంఆర్డీఏను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా  రాష్ట్రంలో 4 జోన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. జోన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తరువాతే రాజధాని మార్పు ఉంటుందని తెలుస్తోంది. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా 4 జోన్లు ఏర్పడనున్నాయి. ప్రతి జోన్ ఛైర్మన్ కు కేబినెట్ హోదా కల్పించడమే కాకుండా ప్రతి జోన్ దేనికదే ప్రత్యేకంగా ఉండేట్టు ప్రణాళిక సిద్ధమైంది. Also read: AP: ఇక ఆ చట్టం లేదు..కొత్తం చట్టం ఏర్పాటు

కొత్త జోన్లు..పరిధిలో ఉన్న జిల్లాలు

విజయనగరం జోన్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు వస్తాయి. కాకినాడ జోన్ పరిధిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉంటాయి. గుంటూరు జోన్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు రానున్నాయి. ఇక కడప జోన్ పరిధిలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలుంటాయి.

ప్రతి జోన్ అక్కడుండే పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా ప్రత్యేకంగా ఉండనున్నాయి. ఇందుకు తగ్గట్టుగా వ్యూహాల్ని ఏపీ సీఎం జగన్ సిద్ధం చేస్తున్నారు. విజయనగరం జోన్ లో..మైనింగ్, గిరిజన సంక్షేమానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతాయి. కాకినాడ జోన్ పరిధిలో ఆక్వా, వ్యవసాయరంగాలకు ప్రాధాన్యత ఇచ్చే చర్యలు చేపడతారు. గుంటూరు జోన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోర్టులు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తారు. కడప జోన్ పరిధిలో హార్టికల్చర్, చిరుధాన్యాల బోర్డు, ఇతర పరిశ్రమలు రానున్నాయి. Also read: AP: ఏపీలో ఈ పాస్ ఇకపై చాలా సులభం

Section: 
English Title: 
Ap Government to start new Zones Shortly
News Source: 
Home Title: 

AP: రాష్ట్రంలో కొత్త జోన్ల వివరాలివే

AP: రాష్ట్రంలో కొత్త జోన్ల వివరాలివే
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AP: రాష్ట్రంలో కొత్త జోన్ల వివరాలివే
Publish Later: 
No
Publish At: 
Sunday, August 2, 2020 - 19:54
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman