Earth Hour: ఇవాళ రాత్రి ఎర్త్ అవర్, రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి ఏం చేయాలంటే

Earth Hour: పర్యావరణ పరిరక్షణకై ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎర్త్ అవర్ పాటించనున్నారు. పర్యావరణ చైతన్యం కోసం ప్రతియేటా నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2022, 02:38 PM IST
Earth Hour: ఇవాళ రాత్రి ఎర్త్ అవర్, రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి ఏం చేయాలంటే

Earth Hour: పర్యావరణ పరిరక్షణకై ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎర్త్ అవర్ పాటించనున్నారు. పర్యావరణ చైతన్యం కోసం ప్రతియేటా నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. 

భూమ్మీత విసర్జితమయ్యే కర్బన ఉద్గారాల్ని తగ్గించడం, ఇంధనాలు-విద్యుత్ ఆదా చేసే ఉద్దేశ్యంతో ఏర్పడిన ప్రజా చైతన్య ఉద్యమమే ఎర్త్ అవర్. వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పదేండ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అత్యవసరమైతేనే లైట్స్, ఇతర పరికరాలు వాడేలా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వయం నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఎర్త్ అవర్‌లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ సమయంలో అంటే రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకూ గంట వ్యవధిలో అన్ని లైట్లు ఆర్పేయాల్సి ఉంటుంది. అదే సమయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. 

రాత్రి ఈ సమయంలో దేశంలోని చారిత్రక కట్టడాలు, స్మృతి కేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లు ఆర్పేయనున్నారు. గంటపాటు చీకటిలోనే గడుపుతారు. దీనివల్ల ఇంధనం పొదుపు అవడమే కాకుండా.భూమ్మీద ఉద్గారం కాస్తైనా తగ్గించేందుకు దోహదమవుతుంది. 

Also read: AP Elections 2024: వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది అక్కడి నుంచే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News