కరోనా నుంచి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

AP Governor Corona: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నెగెటివ్ గా తేలినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 09:42 AM IST
కరోనా నుంచి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

AP Governor Corona: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నెగెటివ్ గా తేలినట్లు తేలిందని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని ఏఐజీ ఆసుపత్రికి చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం శనివారం సాయంత్రం విడుదల చేసిన నివేదికలో తెలిపారు.

ఈ నెల 17న దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆయన స్వల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడం వల్ల గవర్నర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.  

Also Read: అసెంబ్లీలో చంద్రబాబు తీవ్ర భావోద్వేగం... మళ్లీ సీఎం అయ్యాకే సభకు వస్తానని శపథం...

Also Read: సాగు చట్టాల రద్దుపై పవన్ కల్యాణ్ రియాక్షన్... ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారంటూ...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News