Sajjala RamaKrishna Reddy on Petrol prices in AP: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై బీజేపీ, టీడీపీలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. నిజాలను ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించిందని గుర్తు చేశారు.
ధరలు పెంచింది కేంద్రమే.. తగ్గించాల్సింది కేంద్రమే..
వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది కేంద్రమేనని సజ్జల వెల్లడించారు. కాబట్టి ధరలు తగ్గించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని (Petrol prices in AP) స్పష్టం చేశారు. ధరలను కేంద్రం పెంచి రాష్ట్రాలు తగ్గించాలని అడగటమేంటని ప్రశ్నించారు.
పెట్రోల్‌పై ఇప్పటివరకు కేంద్రం రూ.3.35 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు సజ్జల. దీనిలో ఎక్సైజ్ సుంకం కేవలం (Exise Duty on Petrol) రూ.47,500 కోట్లేన్నారు. అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చింది రూ.19,475 కోట్లని వివరించారు. మిగతా రూ.3.15 లక్షల కోట్లు కేంద్రం (Centre income with Petrol) ఖజానాకే చేరాయని చెప్పారు.
కొవిడ్ కారణంగా రాష్ట్రాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు సజ్జల. ఇప్పడున్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను (No Price cut on Petrol in AP) తగ్గించడం రాష్ట్రాలకు సాధ్యపడదని వెల్లడించారు.
Also read: Five years to the demonetisation: పెద్ద నోట్ల రద్దుకు నేటితో ఐదేళ్లు- కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
Also read: YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ చేతికి కీలక ఆధారాలు
తెలంగాణలో పరిస్థితి ఇలా..
తెలంగాణలోనూ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR on Petrol price) ఆదివారం తేల్చి చెప్పారు. ధరలు పెరుగుదలకు కారణం కేంద్రమే కాబట్టి.. తగ్గించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని స్పష్టం చేశారు.
దీపావళి కానుకగా కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని కేసీఆర్ విమర్శించారు. పెంచేటప్పుడుప కొండంత పెంచి.. విసరంత తగ్గించారని కేంద్రంపై ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందునే కేంద్రం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుందని విమర్శించారు.
Also read: US Travel Curbs Lifted: ఆంక్షల ఎత్తివేతతో అమెరికా-భారత్ మధ్య ప్రయాణాలు పునఃప్రారంభం
Also read: Mukesh Ambani Security: ముకేశ్ అంబానీ ఇంటి వద్ద భద్రత పెంపు- ఎందుకంటే..
పెట్రోల్ ధరల తగ్గుదల ఇలా..
ప్రజలకు దీపావళి కానుకగా.. పెట్రోల్, డీజిల్‌లపై (petrol, diesel ) ఎక్సైజ్ సుంకం (Excise duty) తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది కేంద్రం. లీటర్ పెట్రోల్‌పై (petrol) రూ.5లు, లీటర్ డీజిల్‌పై (diesel) రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని సూచించింది. తగ్గిన ధరలు ఈ నెల 4 నుంచి అమలులోకి వచ్చాయి.
కేంద్ర సూచన మేరకు పలు రాష్ట్రాలు ధరలను తగ్గించాయి. అయితే ఇందులో ఎక్కువ మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పాలిత పంజాబ్ ప్రభుత్వం ఆదివారం సంచలన నిర్ఱణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో పెట్రోల్ ధరను రూ.10, డీజిల్ ధరను రూ.5 తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆదివారం ప్రకటించారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేది లేదని తెలుగు రాష్ట్రాలు తమ వైఖరిని తాజాగా స్పష్టం చేయగా.. కొన్ని రాష్ట్రాలు దీనిపై ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.
Also read: Bandi Sanjay Fire on KCR: సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: ఎంపీ బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook