Coronavirus : జైలు ఖైదీల విడుదలకు హై పవర్ కమిటీ ఏర్పాటు

కరోనా వైరస్ (Coronavirus) ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్న తరుణంలో ఒకరి నుండి మరొకరు సోషల్ డిస్టన్సింగ్ (Social distancing) మెయింటేన్ చేయాల్సిందిగా కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే జనం ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకూడదని.. సమూహాలుగా తిరిగే చోట వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు (WHO experts) సైతం విజ్ఞప్తిచేస్తున్నారు.

Last Updated : Mar 26, 2020, 06:45 PM IST
Coronavirus : జైలు ఖైదీల విడుదలకు హై పవర్ కమిటీ ఏర్పాటు

అమరావతి : కరోనా వైరస్ (Coronavirus) ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్న తరుణంలో ఒకరి నుండి మరొకరు సోషల్ డిస్టన్సింగ్ (Social distancing) మెయింటేన్ చేయాల్సిందిగా కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే జనం ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకూడదని.. సమూహాలుగా తిరిగే చోట వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు (WHO experts) సైతం విజ్ఞప్తిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ నివారణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ (AP govt) తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనావైరస్ సోకకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

Read also : Lockdown: అనుమతి లేకుండా సంవత్సరీకం.. కేసు నమోదు

సుప్రీంకోర్టు ఆదేశాలకు (Supreme court orders) అనుగుణంగా కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఖైదీలకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు ఏపీ సర్కార్ నడుం బిగించింది. ఖైదీల నేరాల తీవ్రతనుబట్టి తాత్కాలిక బెయిల్ లేదాపెరోల్‌పై ఖైదీలను విడుదల చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకుంది. అర్హత ఉన్న ఖైదీల జాబితాను సిద్ధం చేసేందుకు ముగ్గురు అధికారులతో హై పవర్ కమిటీ (high power committee) ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఏపీలోనే కాకుండా దేశంలోని అనేక సెంట్రల్ జైళ్లలో ఖైదీల విడుదలకు ఏర్పాట్లు జరిగిపోతున్న సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News