దీపావళి వేడుకలకు ఏపీ సర్కారు సన్నాహాలు

Last Updated : Oct 11, 2017, 03:06 PM IST
దీపావళి వేడుకలకు ఏపీ సర్కారు సన్నాహాలు

కృష్ణా, గోదావరి నదుల సంగమ స్థలిలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 17, 18వ తేదీలలో పవిత్ర హారతులు, అరవై అడుగుల నరకాసుర వధ, సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు, పెద్ద ఎత్తున బాణాసంచాలతో సంబరాలు చేయనుంది. ఈ వేడుకలను తిలకించటానికి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా హాజరుకావచ్చు.  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ వారు సంయుక్తంగా ఈ సంబరాలను అమరావతి రాజధాని ప్రాంతం కృష్ణా, గోదావరి నదుల సంగమ స్థలి.. పవిత్ర సంగమం వద్ద నిర్వహించనున్నారు. 

సంబరాలలో భాగంగా మొదటి రోజు (17 వ తేదీన) పవిత్ర హారతి నిర్వహిస్తారు. రెండవ రోజు (18 వ తేదీన) కూడా పవిత్ర హారతి ఇస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, సంగీత కచేరీలు, మిమిక్రీ వంటివి నిర్వహిస్తారు. ముగింపు కార్యక్రమంలో 60 అడుగుల నరకాసుర వధ నిర్వహించి, పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారు. ఆకాశంలో తారాజువ్వల వెలుగులు సందర్శకులను కట్టిపడేస్తాయి. 

Trending News