చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా రెవిన్యూ అధికారుల నోటీసులు

చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా రెవిన్యూ అధికారుల నోటీసులు

Last Updated : Aug 18, 2019, 10:13 AM IST
చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా రెవిన్యూ అధికారుల నోటీసులు

అమరావతి: కృష్ణా నది వరద ఉదృతి అంతకంతకూ పెరుగుతుండటంతో ఏ క్షణమైనా ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలు నీట మునిగే ప్రమాదం లేకపోలేదని భావించిన అక్కడి రెవిన్యూ అధికారులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీచేస్తున్నారు. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న చంద్రబాబు ఇంటికి సైతం ఈ నోటీసులు జారీ అయ్యాయి. చంద్రబాబుకి నోటీసులు జారీచేయడానికని ఆయన నివాసానికి వెళ్లిన స్థానిక వీఆర్వోను చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదని తెలుస్తోంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సదరు వీఆర్వో ఆ నోటీసును చంద్రబాబు నివాసం బయటి గోడపై అతికించి వెళ్లినట్టు సమాచారం అందుతోంది.

కరకట్ట పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితిని సమీక్షించే ప్రయత్నంలో భాగంగా శుక్రవారం ఉదయం ఏపీ సర్కార్ డ్రోన్లను ప్రయోగించడం.. అనుమతి లేకుండా హై సెక్యురిటీ జోన్‌లో వున్న తన ఇంటిపైకి డ్రోన్స్‌ని ఎలా ప్రయోగిస్తారని చంద్రబాబు ప్రశ్నించడం తదితర పరిణామాలను ఏపీ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్థానిక రెవిన్యూ అధికారుల నుంచి చంద్రబాబు నివాసానికి నోటీసులు జారీ అవడం మరోసారి చర్చనియాంశమైంది.

Trending News