AP Weather Forecast: వేసవి ప్రతాపం ఈసారి చాలా తీవ్రంగా ఉంది. రోహిణి కార్తె దాటినా ఎండల తీవ్రత తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వడగాల్పులు, భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భయంకరమైన ఉక్కపోతతో విలవిల్లాడుతున్న జనానికి రుతుపనాల ఆగమనం ఉపశమనం కల్గించనుంది.
ప్రతి ఏటా రోహిణి కార్తె ప్రారంభం వరకూ ఎండలున్నా చివరికొచ్చేసరికి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం చల్లబడుతుంది. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రోహిణీ కార్త దాటి మృగశిర కార్తె ప్రవేశించినా ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఇంకా 44-45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది ఏపీ , తెలంగాణ రాష్ట్రాలో. ఈ సమయంలో ఇంత ఉష్ఘోగ్రత అంటే సాధారణం కంటే 5-6 డిగ్రీలు ఎక్కువే అని చెప్పాలి. దీనికి తోడు వడగాల్పులు, తీవ్రమైన ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు. కోస్తాంధ్రలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. వాతావరణంలో పొడి ఎక్కువగా ఉండటం దీనికి కారణం. ఇటీవల ఏప్రిల్ నెలలో వచ్చి మోకా తుపాను కారణంగా తడి తగ్గిపోయింది.
నిన్న అంటే జూన్ 9వ తేదీన కూడా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అత్యధికంగా 45.5 జిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాకినాడ సమీపంలో 45.3 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలతో , వడగాల్పుతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతు పవనాలు వచ్చేస్తున్నాయి.
ఇప్పటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను ప్రభావంతో బంగాళాఖాతంలో శ్రీలంక వరకూ విస్తరిస్తున్నాయి. ఫలితంగా 3 రోజుల్లోనే తమిళనాడు, కర్ణాటక వరకూ నిన్న విస్తరించాయి. సాధారమంగా కేరళను తాకిన తరువాత ఏపీ, తెలంగాణలకు చేరేందుకు 4 రోజుల సమయం పడుతుంది. కానీ రుతు పవనాల గమనం వేగంగా ఉండటంతో మరో రెండ్రోజుల్లో రాష్ట్రాన్ని తాకవచ్చని అంచనా. అదే జరిగితే వరుణుడి పలకరింపుతో వాతావరణం చల్లబడనుంది. విస్తారమైన వర్షాలతో భూతాపం తీరవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook