Corona Positive Cases: ఏపీలో ఒక్కరోజులో 27 మంది మృతి, కొత్తగా 5,963 మందికి కరోనా

Corona Positive Cases In AP: ఆదివారం ఒక్కరోజు ఏపీలో 2,569 మంది కరోనా మహమ్మారిని జయించారు. అదే సమయంలో ఏపీలో కరోనా బారిన పడి 27 మంది మృతిచెందారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,68,000కి చేరింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 19, 2021, 07:07 PM IST
Corona Positive Cases: ఏపీలో ఒక్కరోజులో 27 మంది మృతి, కొత్తగా 5,963 మందికి కరోనా

Corona Positive Cases In AP: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు రేపుతోంది. తొలి దశలో సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొన్న దేశమైన భారత్‌ను కరోనా రెండో దశలో వణికిస్తోంది. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్ల ప్రభావం మాటను పక్కనపెడితే, విదేశీ వ్యాక్సిన్లతో కరోనాకు చెక్ పెడతామని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది. ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. 

ఏపీలో గడిచిన 24 గంటల్లో మొత్తం 37,765 కోవిడ్-19 టెస్టులు నిర్వహించగా, 5,963 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో ఏపీలో కరోనా బారిన పడి 27 మంది మృతిచెందారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,68,000కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 7,437కు చేరింది. ఆదివారం ఒక్కరోజు ఏపీలో 2,569 మంది కరోనా(CoronaVirus) మహమ్మారిని జయించారు. చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.  ఇటీవల కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నందున ఏపీలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 48,053కు చేరింది. 

Also Read; COVID-19 Lockdown: లాక్‌డౌన్ ప్రకటించగానే Wine Shopsకు మందుబాబులు పరుగులు Viral

గత 24 గంటల్లో ఏపీలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,182 మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యల్పంగా 19 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. గుంటూరు జిల్లాలో 938, శ్రీకాకుళం జిల్లాలో 893, తూర్పు గోదావరి జిల్లాలో 626, విశాఖపట్నం జిల్లాలో 565, నెల్లూరు జిల్లాలో 491 కరోనా కేసులు నిర్ధారించారు. అనంతపురంలో 156, కడప జిల్లాలో 189, కృష్ణా జిల్లాలో 171, ప్రకాశంలో 280, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 19 మంది తాజాగా కరోనా(COVID-19) బారిన పడ్డారు. 

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 922 మంది కరోనాతో చనిపోగా, విజయనగరం జిల్లా 240 కరోనా మరణాలతో కరోనా తీవ్రత తక్కువ ఉన్న జిల్లాగా నిలిచింది. ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. భారీ సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ మోతాదుల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సర్కార్ లేఖలు రాయడం తెలిసిందే.

Also Read: EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో Cash విత్‌డ్రా చేయవచ్చు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News