APPSC Group2 Mains: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష జూలై 28న జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 7న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం 899 పోస్టుల భర్తీకై గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. మెయిన్స్‌కు మొత్తం 92,250 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు.
గ్రూప్ 2 మెయిన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్దులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 2 మెయిన్ పరీక్ష జూలై 28న జరగనుంది. 2023 డిసెంబర్‌లో 899 గ్రూప్ 2 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడగా ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ప్రతి ఒక్క పోస్టుకు వందమందికి అవకాశం ఇవ్వడంతో మొత్తం 92,250 మంది క్వాలిపై అయ్యారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు సంబంధించి ఈ నెల 5 నుంచి 18 వరకూ పరీక్ష కేంద్రం, పోస్టు, జోనల్ లేదా జిల్లా ప్రిఫరెన్సులు సమర్పించాల్సి ఉంది. జూలై 28వ తేదీన ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో ఆఫ్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది.
2018లో జరిగిన గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఒక పోస్టుకు 12 మంది చొప్పున మెయిన్స్‌కు అర్హత ఇచ్చారు. ఈసారి మాత్రం ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఒక పోస్టుకు 100 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఇంతమందిని మెయిన్స్‌కు ఎంపిక చేయడం ఇదే తొలిసారి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 899 పోస్టుల్లో డిప్యూటీ తహశిల్దార్ పోస్టులు 114, ఎక్స్చైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 150, మున్సిపల్ కమీషనర్ పోస్టులు గ్రేడ్ 3 నాలుగు, గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులు 28 ఉన్నాయి. ఇవి కాకుండా 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అయితే 566 ఉన్నాయి. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. గ్రూప్ 2 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్ధులంతా పరీక్షకేంద్రం వంటి వివరాలను https://www.psc.ap.gov.inలో నమోదు చేసుకోవాలి.
Also read: AP Election Counting 2024: మరి కాస్సేపట్లో కౌంటింగ్ ప్రారంభం, అందరి చూపూ ఏపీవైపే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook