APPSC Group 2 Notification 2023: నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నాయి. ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25 నిర్వహించనున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తులను స్వీకరించనుంది. ఈ పోస్టులకు లక్షల్లో నిరుద్యోగులు పోటీపడుతుంటారు. గ్రూప్-2లో ప్రిలిమ్స్, మెయిన్స్ పేపర్లు ఉంటాయి. ప్రిలిమనరీలో క్వాలిఫై అయినవారు మెుయిన్స్ కు అర్హత సాధిస్తారు. ఈసారి ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అంతేకాకుండా కంప్యూటర్ ప్రొఫిషీయన్సీ సర్టిఫికెట్ ను కూడా తప్పనిసరి చేసింది.
కొత్త సిలబస్ ఇదే..
ప్రిలిమ్స్
జనరల్ స్టడీస్- 150 మార్కులు
a) భారతదేశ చరిత్ర- 30 మార్కులు
b) భూగోళశాస్త్రం- 30 మార్కులు
c) భారతీయ సమాజం- 30 మార్కులు
d) కరెంట్ ఆఫైర్స్- 30 మార్కులు
e) మెంటల్ ఎబిలిటీ- 30 మార్కులు
మెయిన్స్
పేపర్ 1- ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర & భారత రాజ్యాంగం- 150 మార్కులు
పేపర్ 2- భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ & సైన్స్ అండ్ టెక్నాలజీ- 150 మార్కులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook