Agnipath Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో భారీ విధ్వంసం జరిగింది. నిరసనకారులను చెదరగొట్టడానికి రైల్వే పోలీసులు కాల్పులు జరపగా ఒక యువకుడు చనిపోయాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి సంబంధించి మొదటి నుంచి కుట్ర జరిగిందనే అనుమానాలు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా చాటింగ్ చేసుకుంటూ అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు వచ్చారని గుర్తించారు. తాజాగా విధ్వంసానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం వెనుక కుట్రకోణం ఉందనడానికి పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆర్నీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల సహకారంతోనే అభ్యర్థులు విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగిందని తేల్చారు. నర్సారావు పేటకు చెందిన ఆవుల సుబ్బారావు అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆవుల సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులు షల్టర్ ఇచ్చినట్లు తేల్చారు పోలీసులు. సుబ్బారావు ఆధ్వర్యంలోనే నిరసనకారులు రైల్వేస్టేషన్ కి వచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. రైల్వే స్టేషన్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు
వాటర్ బాటిల్ లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వహకులే సమకూర్చారని పోలీసులు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పది ప్రైవేటు ఆర్మీ కోచింగ్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకున్న నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు తేల్చారు పోలీసులు. మూడు రోజుల క్రితం ఆర్మీ రాత పరీక్ష రద్దు అయిందని యూట్యూబ్ లో వీడియోలు వచ్చాయి. ఆ తర్వాతే ఈ కుట్రకు ప్లాన్ జరిగిందని తెలుస్తోంది. విద్యార్థులను రెచ్చగొట్టిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును గుంటూరు జిల్లా పోలీసులు నరసరావుపేటలో అదుపులోనికి తీసుకున్నారు. అతని విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోనికి వస్తాయని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.