Badvel, Huzurabad Counting live updates: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రెండు నియోజకవర్గాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యత అధికార పార్టీకే దక్కింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అటు హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. బద్వేలు, హుజూరాబాద్ రెండు నియోజకవర్గాల్లోనూ ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యత అధికారపార్టీలే సాధించాయి. బద్వేలులో(Badvel Bypoll Counting Updates) అయితే ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితం కూడా వచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి రౌండ్‌లో కూడా ఆధిక్యతలో ఉంది. తొలి రౌండ్‌లో 329 ఓట్ల ఆధిక్యతలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ ఉన్నారు. బద్వేలు కౌంటింగ్ మొత్తం 11 రౌండ్లలో జరగనుంది. తొలి రౌండ్ ముగిసేసరికి వైసీపీ 8 వేల 790 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ఇక హుజూరాబాద్ ఉపఎన్నికకు(Huzurabad Bypoll Counting Updates) సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది మొత్తం 740 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి ఇందులో అధికార పార్టీ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. ఇందులో టీఆర్ఎస్ పార్టీకు 503, బీజేపీకు 159, కాంగ్రెస్ కు 32 చెల్లని ఓట్లు 14 వరకూ ఉన్నాయి. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు హుజూరాబాద్ టౌన్‌కు సంబంధించి జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. తొలి రౌండ్ ముగిసేసరికి బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉందని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ 168 ఓట్ల తేడాతో గెలిచింది.
Also read: Huzurabad Bypoll Results 2021: హుజూరాబాద్ ఫలితం తేలేది ఎన్నిగంటలకో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి