విభజన హామీలపై ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధ్యం కానివి అడగడంలో చంద్రబాబు, జగన్ ఇద్దరు ఇద్దరే ఎద్దేవ చేశారు. గతంలో తాము కొన్ని అంశాలు సాధ్యం కావు అని చంద్రబాబుకు స్పష్టం చేశామని... ఇప్పుడ అది వైఎస్ జగన్ కూ వర్తిస్తుందని జీవీఎల్ స్పష్టం చేశారు.
హోదా వృధా ప్రయాసే ?
గతంలో సాధ్యం కాదని చెప్పిన విషయాలనే మళ్లీ జగన్ సర్కారు అడుగుతుండటం సరికాదని ...ఇలా పదే పదే సీఎం జగన్ ఇక కేంద్రాన్ని అడగడం వృధా ప్రయాస అని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర పెద్దలను కలిసిన ఏపీ సీఎం జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో జీవీఎల్ ఈ మేరకు స్పందించారు.
జగన్ పనితీరు గమనిస్తున్నాం...
ఏపీ రాజకీయాలపై జీవీఎల్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ పాలనపై బీజేపీ ఫోకస్ పెట్టిందని.. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిందున పనితీరును ఇప్పుడే అంచనా వేయలేమన్నారు . కనీసం ఆరు నెలల సమయం వరకు వేచి చూడాలని భావిస్తున్నామని ...ఆ తర్వాతే జగన్ సర్కారు పనితీరుపై తమ అభిప్రాయాలు..కార్యచరణ వెల్లడిస్తామని తెలిపారు. ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
చంద్రబాబు, జగన్ ఇద్దరు ఇద్దరే - ప్రత్యేక హోదా డిమాండ్ పై జీవీఎల్ కౌంటర్