BRS Social Media Questions To Ponguleti Srinivasa Reddy ED Raids: పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాలపై ఈడీ దాడులు జరిగి వారాలు గడుస్తున్నా వివరాలు బయటకు రాకపోవడంపై మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ సందేహాలు లేవనెత్తింది. ఈడీ దాడుల కోసం పొంగులేటి బీజేపీ ముందు మోకరిల్లాడని బీఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది.
Ponguleti Srinivasa Reddy Bomb Comments: రాజకీయ బాంబు వ్యాఖ్యల పేరుతో నవ్వులపాలైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఈసారి మామూలు బాంబు కాదని ఆటమ్ బాంబ్ పేలుతుందని వర్ధన్నపేట సభలో ప్రకటించారు.
Once Again Ponguleti Srinivasa Reddy Bomb Comments: దీపావళి ముందు రాజకీయ బాంబు పేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి అదే వ్యాఖ్యలు చేశారు. ఈసారి మామూలు బాంబు కాదని ఆటమ్ బాంబ్ పేలుతుందని ప్రకటించారు.
KTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, అతడి మంత్రుల అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతానని సంచలన ప్రకటన చేశారు.
Ponguleti Srinivas Reddy Warangal Visit: వరుసగా బాంబులు పేలుతాయని చెప్పిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరో బాంబు పేల్చారు. వరంగల్ అభివృద్ధిపై సంచలన ప్రకటన చేశారు. రాజధానిగా మరో నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Ponguleti Srinivasa Reddy-Komatireddy Rajgopal Reddy Meet: తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మార్పు జరిగిన రోజే కోమటిరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది.
ZP Chairman Koram Kanakaiah Resigns: ఖమ్మంలో కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యతోపాటు 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్‌కు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రాహుల్ గాంధీని కలిసేందుకు ఇద్దరు నేతలు తమ అనుచరులతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ గాంధీతో భేటీకానున్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అనుచరుడు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్యను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. గతేడాది నమోదైన ఓ కేసులో ఆయన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం బ్రహ్మయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా షాక్‌లు ఇస్తోంది. ఆయన అనుచరులపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. పొంగులేటి ముఖ్య అనుచరుడు మువ్వా విజయ్ బాబు సీఐడీ కేసు నమోదు చేసింది.
బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు అయింది. రేపు ప్రెస్‌మీట్ ప్రకటించే అవకాశం ఉంది.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రకటన రాకముందే అసంతృప్త నేతలు పార్టీ జంప్ అవుతున్నారు. త్వరలోనే చేరికలు మరింత జోరు అందుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కీలక నేత వైఎస్ఆర్టీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Telangana Politics: అధికార బీఆర్ఎస్లో ముసలం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబుతున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక నేత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుండగా.. మరో నాయకుడు మాత్రం పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.