ఫెయిలైనా తల్లిదండ్రులు మందలించలేదని విద్యార్థిని ఆత్మహత్య

ఫెయిలైతే మదలించలేదని విద్యార్థిని ఆత్మహత్య

Updated: May 14, 2018, 01:58 PM IST
ఫెయిలైనా తల్లిదండ్రులు మందలించలేదని విద్యార్థిని ఆత్మహత్య

ప్రకాశం జిల్లా తురకపాలెంకు చెందిన గురులక్ష్మీ(20)బీటెక్‌లో 9 సబ్జెక్టుల్లో ఫెయిలైనా తల్లిదండ్రులు ఏమీ అనకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌ నోట్‌ రాసి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం జరగగా ఆదివారం వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. తెనాలిలోని ఓ కాలేజీలో గురులక్ష్మీ బీటెక్ చదువుతోంది. ఫస్టియర్‌లో ఈమె తొమ్మిది సబ్జెక్టులు తప్పింది. అయినా తల్లిదండ్రులు ఏమీ అనలేదు. దీన్నే ఆ విద్యార్థిని సీరియస్‌గా తీసుకున్నట్లుంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుఝామున కన్నుమూసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.