మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఇళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ( మంగళవారం) ఉదయం నుంచి సీబీఐ అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సహా ఇతర అన్ని కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలో ఏకకాలంగా సీబీఐ అధికారులు , సిబ్బంది సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాయపాటి సహా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నారు.
ప్రయివేట్ బ్యాంకు నుంచి రూ. 300 కోట్ల రుణం
గతంలో ఓ ప్రయివేట్ బ్యాంక్ నుంచి రాయపాటి సాంబశివ రావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ 300 కోట్ల రుణం తీసుకుంది. ఐతే ఆ రుణాన్ని ఇప్పటి వరకు బ్యాంకుకు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో రాయపాటి సాంబశివరావుతోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై ప్రయివేట్ బ్యాంకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన ఇళ్లు, ఆఫీసులపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..