ప్లాస్టిక్‌ జాతీయ జెండా వినియోగంపై నిషేదం

                                          

Updated: Aug 9, 2018, 12:32 PM IST
ప్లాస్టిక్‌ జాతీయ జెండా వినియోగంపై నిషేదం

స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో జాతీయజెండాకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. పౌరలెవరూ ప్లాస్టిక్‌తో చేసిన జాతీయ జెండాలను ఉపయోగించొద్దని కోరింది. ప్లాస్టిక్ బదులు పేపర్ జెండాలు వాడాలని సూచించింది.  దీన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొంది. ఈ మేరకు ప్లాస్టిక్ జెండాలు వినియోగించుకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఫ్లాగ్ కోడ్ అమలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరింది. అలాగే ప్లాస్టిక్ ఫ్లాగ్‌లను ఉపయోగించరాదన్న విషయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మీడియాలో  ప్రకటనలు ఇవ్వనున్నట్టు తెలిపింది. 

కారణం ఇదే... 
ఇటీవలి కాలంలో జెండా పండగ దినోత్సవాల్లో పేపర్ కు బదులు ప్లా్స్టిక్ తో చేసిన జాతీయజెండాలను వాడటం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. వాస్తవానికి కాగితంలా వీటికి మట్టిలో కలిసిపోయే గుణం లేదని..డీ కంపోజ్ కాకపోవడంతో పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందని పర్యవరణ శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో హోంశాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది.