రాజకీయాలకు చిరు ఇక పుల్ స్టాప్ ?

.

Last Updated : Sep 14, 2017, 04:34 PM IST
రాజకీయాలకు చిరు ఇక పుల్ స్టాప్ ?

చిరంజీవి ఇక పొలిటికల్ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టి పూర్తి స్తాయిలో సినిమాలకే పరిమితమౌతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై చిరంజీవి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. తాజా పరిణామాలను గమనిస్తే ఈ ఊహాగాలకు బలన్నిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీలో క్రియాశీలంగా కొనసాగడం లేదు.పార్టీ సమావేశాల నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి మళ్లీ సినీ ఎంట్రీ ఇచ్చి తన 150వ సినిమాలో నటించారు. ప్రస్తుతం 151 చిత్రం షూటింగ్ కు రెడీ అవుతున్నారు. ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండటం సినీమాల కోసం ఎక్కువ సమయం కేటాయించడం వంటి పరిణామాలతో ఆయన రాజకీయలపై ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. చిరు పొలిటికల్ కెరీస్ పై ఉత్కంఠత వీడాలంటే మరికొన్ని రోజులు పాటు వేచిచూడాల్సిందే మరి.

Trending News