Corona Third Wave: కరోనా మహమ్మారి మరో ప్రమాదంతో ముందుకొస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నుంచి తేరుకోకముందే థర్డ్‌వేవ్ హెచ్చరికలు చేస్తోంది. చిన్నారులకు ప్రమాదకరంగా భావిస్తున్న థర్డ్‌వేవ్ ఇండియాలో ప్రారంభమైపోయిందా..ఇప్పుడిదే చర్చనీయాంశమవుతోంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి దేశమంతా విలవిల్లాడిపోయింది. ఇంకా సెకండ్ వేవ్ నుంచి తేరుకోలేదు. త్వరలో రానున్న థర్డ్‌వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని..ముఖ్యంగా చిన్నారుల్ని టార్గెట్ చేయనుందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా థర్డ్‌వేవ్ అప్పుడే ఇండియాలో ప్రారంభమైపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలో ఏకంగా 8 వేలమంది చిన్నారులకు కరోనా వైరస్ సోకడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కచ్చితందా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ఇండియాలో ప్రవేశించిందనడానికి ఇదే ఉదాహరణ అని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా వైరస్(Coronavirus) చిన్నారుల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.
తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా వైరస్ బారినపడిన 8 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరారు. వీరిలో ముగ్గురు కడప జిల్లాకు చెందినవారు కాగా..చిత్తూరు జిల్లాకు చెందినవారు ఆరుగురు ఉన్నారు. ఈ 8 మంది చిన్నారులు గత మూడ్రోజుల్లో చేరినవారే కావడం విశేషం. రెండు మూడ్రోజుల వ్యవధిలో ఇంతమంది చేరడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. గత 15 రోజుల్లో మరో 20 మంది చిన్నారులు కూడా చికిత్స పొంది కోలుకున్నారు. మరోవైపు పుత్తూరులో మరో 8 మంది పిల్లలకు కరోనా వైరస్ సోకింది. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో(Home Isolation)ఉన్నారు.
Also read: Krishnapatnam ఆనందయ్య Corona Medicine పంపిణీ ప్రారంభం, కృష్ణపట్నంలో గందరగోళం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook