ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో నియంత పాలన: సీపీఐ

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ నియంతపాలన సాగిస్తున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.

Updated: Feb 8, 2020, 07:11 PM IST
ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో నియంత పాలన: సీపీఐ

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ నియంతపాలన సాగిస్తున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. సుష్మాస్వరాజ్‌ను అవమానించేలా తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రదాని మోదీ గుర్తెరగని, విభజనను అవమానించడం సరికాదన్నారు. 

2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణ పర్యటనలో భాగంగా, తాము అదిఆకారం లోకి వస్తే కేవలం 100 రోజుల్లోనే తెలంగాణను ఏర్పాటు చేస్తామన్న మాటలను ఆయన గుర్తు చేశారు. హక్కుల కోసం అడిగితే అర్బన్‌ నక్సలైట్ల ముద్ర వేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం గురించి ఆర్మీ పాఠాలు చెబుతోంది.. ఇది మంచిది కాదన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్లే దేశ జీడీపీ పడిపోయిందని ఆరోపించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజ్యం, పోలీసుల రాజ్యం నడుస్తోందని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. పార్లమెంట్‌లోనూ వైసీపీ ఎంపీలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేశారంటూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేశినేని నాని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..