ఏపీ కొత్త ఛీప్ సెక్రటరీగా ఉన్న సమీర్ శర్మ ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఛీఫ్ సెక్రటరీ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఎవరనేది స్పష్టత లేకుండా ఉన్నా..మరో పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆ వివరాలు మీ కోసం..
ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డితో పాటు మహిళా ఐఏఎస్ అధికారిణులైన శ్రీలక్ష్మి,, పూనం మాలకొండయ్య పేర్లు విన్పించాయి. కేఎస్ జవహర్ రెడ్డి దాదాపు ఖరారైనట్టుగా వార్తలు కూడా వచ్చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. ప్రభుత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుందో తెలియలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మరో పేరు బయటికొచ్చింది. ఆయనే ఏపీ కేడర్ సీనియార్టీ జాబితాలో రెండవస్థానంలో ఉన్న గిరిధర్ అరమణే.
ఈయన కొత్త ఛీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపడితే 2023 జూన్ 30 వరకూ పదవిలో ఉంటారు. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గిరిధర్ అరమణే ప్రస్తుతం రక్షణశాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఈయనను అక్కడి నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఆయన తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also read: AP Politics: గంటా శ్రీనివాసరావు టీడీపీకు గుడ్ బై, త్వరలో వైసీపీలో చేరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook