పెట్రోల్ రేటును యథాతథంగాఉంచుతూ డీజిల్ రేటును 8 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. తాజా పెంపుతో డీజిల్ ధర వరుసగా పదోరోజు పెంచినట్లయింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఉపశమనం కాస్త ఆవిరై సామాన్యుడిపై మళ్లీ అదే భారం పడుతోంది.
ఇంధనంపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.1.50 మేర తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవలె సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మరో రూపాయి రాయితీ ఇవ్వాలని చమురు సంస్థలను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో పెట్రో ధరలపై 2.50 ఉపశమనం లభించినట్లయింది.
పెట్రో ధరల నుంచి సామాన్యులకు లభించిన ఉపశమనం కాస్త ఇప్పుడు ఆవిరైపోయింది. సోమవారం నాటి పెంపు తర్వాత ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.75కి చేరింది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడానికి ముందు రోజున ధర 75.45గా ఉండేంది. తాజా ధరలను బట్టి చూస్తే ఉపశమనం తాత్కాలికమేనని తేలిపోయింది. సామాన్యులు మళ్లీ అదే భారాన్ని మెయాల్సిందేనట.