పట్టణ వాసులకు ముంచుకొస్తున్న తాగు నీటి ముప్పు !!

ఎండాకాలం ముగిసింది ...ఇక నీటి కష్టాల నుంచి గట్టేక్కినట్టే.. అని జనాలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో సారి పట్నవాసులకు తాగునీటి ముప్పు మంచుకొస్తుంది. 

Last Updated : Jul 22, 2019, 11:40 AM IST
పట్టణ వాసులకు ముంచుకొస్తున్న తాగు నీటి ముప్పు !!

ఎండాకాలం ముగిసింది ...ఇక నీటి కష్టాల నుంచి గట్టేక్కినట్టే.. అని జనాలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో సారి పట్నవాసులకు తాగునీటి ముప్పు ముంచుకొస్తుంది. ఈ వార్త కొంత షాక్ కు గురి చేస్తున్నప్పటికీ ..ఇది మాత్రం నిజం ..విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి.

ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ వాసులకు తాగు నీటి ముప్పు తప్పేలా లేదు. ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో వర్ష పాతం నమోదు కాలేదు.. రానున్న రోజుల్లో ఇదే తరహా తక్కవ వర్ష పాతం నమోదు అయితే నీటి గండం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం తగినంత వర్షపాతం నమోదు కాకపోతే 2 నెలల తరువాత రాష్ట్రంలోని ఏకంగా 8 నగరాలు తాగునీటి కోసం అల్లాడే పరిస్థితులు రానున్నాయి.  కొన్ని పట్టణాలకు  ఇప్పుడున్న నీటి నిల్వలు వచ్చే నెలాఖరు వరకే సరిపోనున్నాయి. మరో కొన్ని పట్టణాలకు సెప్టెంబరు వరకే సరిపోయతాయి. ఈ ఏడాది అనుకున్న వర్షపాతం నమోదు కాకపోతే  నీటి వనరులు ఆవిరయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాగు నీటి ముప్పు ఉన్న పట్టణాలు ఇవే
విజయనగరం 
విశాఖపట్నం 
నెల్లూరు 
ఒంగోలు
కర్నూలు 
కడప 
చిత్తూరు 
తిరుపతి 
గత ఏడాది చెప్పిన పాఠాలు...
గత ఏడాది కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవడంతో ఏపీలోని ప్రధాన పట్టణాలైన విశాఖ,  విజయనగరం,  నెల్లూరు, ఒంగోలు, కడప, చిత్తూరు, తిరుపతి, కర్నూలు పట్టణాల్లో జలాశయాలు అడుగంటిపోయాయి. దీంతో అయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికీ తగినంత వర్షం పడలేదు. దీంతో ఆయా పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు అందించే పరిస్థితి ఏర్పడింది. కాగా వర్షాభావం ఇలాగే కొనసాగితే.. కొన్నాళ్లకు వీటిలో నీటి ముప్పు తప్పదని సంబంధిత శాఖ అధికారుల చెబుతున్నారు.

ప్రత్యేక కార్యాచరణ సిద్ధం
తాగునీటి సమస్యపై పురుపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాగు నీటి విషయంలో పట్టణవాసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్న బొత్స... వర్షాభావంతో ఈ ఏడాది పలుచోట్ల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు నీరందిస్తామన్నారు
.

Trending News