Telugu Desam Party: ఏపీలో అధికారంలోకి వచ్చామన్న సంతోషం టీడీపీ సీనియర్లలో కనపడడం లేదా..? కొందరు మంత్రులుగా ఉన్నా వారిలో సైతం అసంతృప్తి ఉందా..? దశాబ్దాలుగా చంద్రబాబు కోటరీగా ఉన్న నేతలు సైతం ఎందుకు సడన్ గా కామ్ అయ్యారు..? పార్టీ పెద్దలు సీనియర్లను పక్కకు పెట్టారా లేదార సీనియర్లే పార్టీనీ పట్టించుకోవడం లేదా..? అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతుంది ..?
Grama Ward Sachivalayam: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. అక్టోబరు నెలకు సంబంధించిన జీతాల్లో కొందరికి 10 శాతం.. మరికొందరికి 50 శాతం కోత విధించనట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. బయోమెట్రిక్ యంత్రం సరిగా పనిచేయక పోవడంతో తక్కువ హాజరు నమోదవ్వడమే అందుకు కారణమని తెలుస్తోంది.
ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులు ..ప్రభుత్వ పోస్టులకు సంబంధిన నోటిఫికేషన్లపై గంపెడాశలు పెట్టుకున్నారు. వారి ఆశలు ఏ మేరకు నెరవేరుతాయనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఏపీ బీజేపీ నేతలు ఈ రోజు గవర్నర్ నరసింహన్ ను కలిసి చంద్రబాబు పాలనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ..కాబట్టి గవర్నర్ చొరవ చూపి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కోరారు..
రైతులకు ఏపీ సర్కార్ సంక్రాంతి కానుకను ప్రకటించింది. వ్యవసాయం కోసం ఉచితంగా 15 లక్షల ఇంధన పొదుపు పంపు సెట్లు పంపిణీ చేయనుంది. అయితే దీన్ని దశలవారీగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2018-19 ఏడాదికి 4 లక్షల నుంచి 5 స్టార్ పంపు సెట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
రూ.1200కే ...ఆరోగ్య రక్ష
ఈ రోజుల్లో చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తినా హాస్పిటల్ బిల్లులు తడిసి ముద్దవుతున్నాయ్...సామాన్య, మధ్యతరగతి జనాలు భరించలేని పరిస్థితి . అసలే ఆకాశానంటుతున్న నిత్యావసరాల ధరలు, పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి అద్దెలు పెనుభారంగా మారాయి. చాలి చాలని జీతంతో కనీస అవసరాలే తీర్చుకోలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో కూడా ఆరోగ్య భద్రత కోసం ఎంతోకంతా వెచ్చించి హెల్త్ ప్రీమియం తీసుకుందామనుకుంటే వేల రూపాయలు ధారపోయాల్సి వస్తోంది. ఇక బీపీ,షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే ఇక అంతే సంగతులు.. సాధరణం కంటే అధికమొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.