Black Turmeric: నల్ల పసుపుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా...

Health Benifits of Black Turmeric: నల్ల పసుపుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా... చర్మ సౌందర్యానికి, గాయాలు త్వరగా మానిపోవడానికి, పొట్ట సంబంధిత సమస్యలకు నల్ల పసుపు బాగా ఉపయోగపడుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 03:38 PM IST
  • నల్ల పసుపు గురించి మీకు తెలుసా
  • నల్ల పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోనాలు
  • చర్మ సౌందర్యానికి, గాయాలు మానడానికి, పలు ఆరోగ్య సమస్యలకు ఇది దివ్య ఔషధం
 Black Turmeric: నల్ల పసుపుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా...

Health Benifits of Black Turmeric: మన దేశంలో పసుపు లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా అన్ని వంటకాల్లో మనం పసుపును వాడుతుంటాం. పసుపు వంటలకు రుచి, రంగునే కాదు... అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా పసుపు యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. అయితే మీరు నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా... నల్ల పసుపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

నల్ల పసుపు ఎక్కడ దొరుకుతుంది..?

నల్ల పసుపు ప్రధానంగా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో పండిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మ సౌందర్యానికి ఇది మరింత మంచిది.

నల్ల పసుపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

1. గాయాలు త్వరగా మానిపోతాయి: చిన్న చిన్న గాయాలకు మనం రకరకాల స్కిన్ క్రీమ్‌లను ఉపయోగిస్తాము. అయితే నల్ల పసుపును నీళ్లలో కలిపి పేస్టులా
గాయాలపై అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. త్వరగా గాయాలు మానిపోతాయి.

2. జీర్ణక్రియ : నల్ల పసుపు పొట్ట సంబంధిత సమస్యలను నయం చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎవరికైనా కడుపునొప్పి లేదా గ్యాస్ సమస్య ఉంటే నల్ల పసుపు వాడితే మంచిది. నల్ల పసుపు పొడిని నీళ్లలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

3. చర్మ కాంతికి: పసుపు లాగే నల్ల పసుపు కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఈ పసుపును తేనెతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతమవుతుంది. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

4. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఉపశమనం: కొందరికి యుక్తవయస్సులోనే కీళ్ల నొప్పులు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారినపడుతారు. అలాంటివారు నల్ల పసుపు పేస్టును ఆ కీళ్ల భాగంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Tomoto Fever: చిన్నారులపై టమాట ఫ్లూ ప్రభావం, తమిళనాడు కేరళ సరిహద్దుల్లో వైద్యుల పరీక్షలు..!

Also Read: SVP First Review: 'సర్కారు వారి పాట' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సింహంలా గర్జించిన మహేష్... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News