EC Notices: చంద్రబాబుకు ఈసీ నోటీసులు 24 గంటల్లో అవి తొలగించాల్సిందే

EC Notices: దేశంలో ఎన్నికల కోడ్ కూయగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ ఈసీ తేల్చిచెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2024, 08:22 AM IST
  • చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు
  • జగన్‌ను కించపరుస్తూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులపై అభ్యంతరం
  • 24 గంటల్లోగా అన్ని పోస్టులు తొలగించాలని ఈసీ ఆదేశం
EC Notices: చంద్రబాబుకు ఈసీ నోటీసులు 24 గంటల్లో అవి తొలగించాల్సిందే

EC Notices: దేశంలో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్చ్ 16న విడుదలైంది. షెడ్యూల్‌తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఇలా అమల్లోకి వచ్చిందో లేదో తెలుగుదేశం పార్టీ నియమావాళి ఉల్లంఘించింది. అసలేం జరిగిందంటే..

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల నియమావళికి విరుద్దంగా అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కించపరిచేలా, వ్యక్తిగత దూషణలు చేస్తూ తెలుగుదేశం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్‌బూక్, యూట్యూబ్ మాధ్యమాలతో తెలుగుదేశం అసభ్య ప్రచారం చేస్తోందని, వ్యక్తిగతంగా దాడి చేస్తోందని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదులను పరిగణలో తీసుకున్న ఎన్నికల సంఘం సోషల్ మీడియా పోస్టుల్ని పరిశీలించింది. వైసీపీ ప్రస్తావించినట్టుగా పోస్టులన్నీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 24 గంటల్లోగా  ఆ పోస్టులన్నింటినీ వివిధ సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాలంటూ చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 

Also read: Ys jagan vs Modi: ఉమ్మడి సభలో ప్రధాని మోదీ..జగన్‌పై ఎందుకు విమర్శలు చేయలేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News